ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > హైదరాబాద్-లండన్ సేవలు ప్రారంభం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హైదరాబాద్-లండన్ సేవలు ప్రారంభం
హైదరాబాద్-లండన్ మధ్య విమాన సేవలను బ్రిటీష్ ఎయిర్‌వేస్ ప్రారంభించింది. ఈ విమానం లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్ నుంచి వారంలో ఐదు రోజులపాటు నడుస్తుందని బ్రిటీష్ ఎయిర్‌వేస్ వర్గాలు తెలిపారు. హైదరాబాద్ నుంచి లండన్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభించిన ఘనత బ్రిటీష్ ఎయిర్‌వేస్ దక్కించుకుంది. లండన్ విమానంలో క్లబ్ క్లాస్ (బిజినెస్), వరల్డ్ ట్రావెలర్ ప్లస్ (ప్రీమియం ఎకానమీ), వరల్డ్ ట్రావెలర్ (ఎకానమీ) తరగతుల్లో ప్రయాణీకులకు బ్రిటీష్ ఎయిర్‌వేస్ సేవలు అందిస్తుంది.

హైదరాబాద్‌లో ప్రతి సోమ, శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో ఉదయం 07.15 ని.లకు బయలుదేరి లండన్‌కు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి ఆది, గురువారాలు తప్ప మిగిలిన రోజుల్లో స్థానిక కాలమానం ప్రకారం లండన్‌లో మధ్యాహ్నం 13.30 ని.లకు బయలుదేరి హైదరబాద్‌కు మరుసటి రోజు తెల్లవారుజామున 04.25 ని.లకు చేరుకుంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వచ్చే కొన్ని రోజుల్లో బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గింపు
సర్‌ఛార్జి తగ్గింపుతో విమాన ప్రయాణం చౌక
మరో 14 డాలర్లకు తగ్గనున్న ముడిచమురు ధర
ఇంధన ధరలు తగ్గింపు: మంత్రి మురళీ దేవ్‌రా
11న బీఎస్ఎన్ఎల్ సాధారణ ఉద్యోగుల సమ్మె
పాకిస్థాన్-భారత్ వాణిజ్య చర్చలు వాయిదా