ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > "బెయిలౌట్ ప్యాకేజీ"కి సెనేట్ తిరస్కారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"బెయిలౌట్ ప్యాకేజీ"కి సెనేట్ తిరస్కారం
FILE
నష్టాల్లో ఉన్న అమెరికా ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకుగానూ అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెయిలౌట్ ప్యాకేజీ సెనేట్ తిరస్కారానికి గురైంది. ఈ బిల్లును అమెరికా ప్రభుత్వం సెనేట్‌లో ప్రవేశపెట్టగానే చర్చ, అనంతరం ఓటింగ్ జరిగింది. అయితే, ఈ బిల్లు మెజారిటీ సభ్యుల ఆమోదాన్ని మాత్రం పొందలేక పోయింది.

తీవ్రమైన నష్టాలలో కూరుకుపోయిన జనరల్ మోటార్స్, క్రిస్లర్స్, ఫోర్డ్ కంపెనీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రతిపాదించింది. కాగా, ఈ బిల్లుపై డెమొక్రటిక్, రిపబ్లికన్ ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంవల్ల సెనేట్ ఆమోదానికి నోచుకోలేక పోయింది.

ఇదిలా ఉంటే... ఆటోమొబైల్ బెయిలౌట్ ప్యాకేజీ అమెరికా సెనేట్ తిరస్కారానికి గురైందన్న విషయం తెలియటంతో... జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలలో శుక్రవారం స్టాక్ మార్కెట్ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అంతేగాకుండా డాలర్ విలువ 90 యెన్‌లుగా, ముడిచమురు ఒక బ్యారెల్‌కు 46 యూఎస్ డాలర్లుగా పడిపోయింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"బ్యాంక్ ఆఫ్ అమెరికా"లో 35 వేల ఉద్యోగాల కోత
పదిహేనేళ్ల కనిష్ట స్థాయికి "పారిశ్రామికోత్పత్తి"
8 శాతానికి చేరుకున్న ద్రవ్యోల్బణం
అమెరికాలో ఒక కారు కొంటే మరో కారు ఉచితం
ఫోర్డ్ ఇండియా కార్ల ధరలు తగ్గింపు
దేశీయ కార్లు, బైకుల అమ్మకాల పతనం