ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > మైక్రోసాఫ్ట్‌లో 9 వేల ఉద్యోగాలకు ఎసరు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మైక్రోసాఫ్ట్‌లో 9 వేల ఉద్యోగాలకు ఎసరు
FILE
ప్రపంచంలోనే అత్యున్నత సాఫ్టవేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన మొత్తం సిబ్బందిలో 10 శాతం మందికి అంటే 9,100 మంది సిబ్బందికి ఉద్వాసన పలకనుంది. అంతర్జాతీయ ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ గనుక తన సిబ్బందిలో 10 శాతంమందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తే ఆ సంస్థ ఇపిఎస్ -ఎర్నింగ్ పర్ షేర్- విలువ 10 శాతం పెరుగుతుందని బ్రోకరేజ్ సంస్థ ఓపెన్ హైమర్, మైక్రోసాఫ్ట్‌కు చెందిన సంస్థాగత మదుపుదార్లకు తెలియపర్చింది.

మైక్రోసాఫ్ట్‌లో మొత్తంమీద 91 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జిబాక్స్, జానే వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్పత్తులను రూపొందించే విభాగంలో కొత్త నియామకాలను మైక్రోసాఫ్ట్ ఈ అక్టోబర్‌లోనే నిలిపివేసింది. వచ్చే సంవత్సరం తొలి మాసంలోనే మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించే అవకాశముందని ఇటీవల వార్తలు వచ్చాయి.

క్లిష్ట కాలాల్లో ఆదాయంలో పెరుగుదల కంటే లాభాలే ముఖ్యమని మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల తొలగింపు ద్వారా మార్కెట్‌కు సూచిస్తోందని ప్రముఖ ఫైనాన్షియల్ విశ్లేషణా సంస్థ ఓపెన్ హైమర్ విశ్లేషకుడు బ్రాడ్ రీబాక్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పెరిగిన విదేశీ మారక ద్రవ్యనిల్వలు
నగల పరిశ్రమలో లక్ష ఉద్యోగాలపై కోత
వారం వారం.. తగ్గుతున్న ద్రవ్యోల్బణం
జామనగర్ రిఫైనరీతో చరిత్ర సృష్టించిన రిలయెన్స్
డాలర్ మారక రూపాయి పతనం
చమురు మార్కెట్ పారదర్శకతకు చర్యలు: భారత్