ప్రపంచం ఆర్థిక చరిత్రలో 2009 అత్యంత బలహీనమైన సంవత్సరంగా చరిత్రలో మిగిలిపోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని గతంలో ఎన్నడూ చవి చూడలేదని చెప్పారు.
ప్రపంచ ఆర్థిక అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ఓకే ఏడాదిలో రెండుసార్లు సవరించింది. ఇప్పటికే మాంద్యం నెలకొనగా వచ్చే సంవత్సరం మరింత తీవ్రతరం కాగలదని హెచ్చరించింది. వచ్చే ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 0.4 శాతం మాత్రమే నమోదు కాగలదని, 1945నుంచి చూసుకుంటే ఇదే అతి తక్కువని పేర్కొంది.
కాగా మరోవైపున హెచ్ఎస్‌బిసి బ్యాంక్ సైతం తనవంతు హెచ్చరికలను చేసింది. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి కూడా 2009లో గణనీయంగా తగ్గిపోతుందని బ్యాంక్ హెచ్చరించింది. |