ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ఓఎన్‌జీసిచే ఇంపీరియల్ ఎనర్జీ కైవసం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఓఎన్‌జీసిచే ఇంపీరియల్ ఎనర్జీ కైవసం
బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ ఎనర్జీ సంస్థను చమురు సహజ వాయు సంస్థ -ఒఎన్‌జిసి- 1.3 బిలియన్ పౌండ్లతో (1.9 బిలియన్ డాలర్లు) స్వాధీనం చేసుకుంది. లండన్‌లో లిస్ట్ అయిన మొత్తం షేర్ హోల్డర్లలో 96.8 శాతం మంది ఈ స్వాధీనానికి మద్దతు తెలుపడంతో ఓఎన్‌జీసికి ఈ ప్రతిష్టాత్మక విలీనం సాధ్యమైంది.

ఈ సందర్భంగా ఒఎన్‌జీసి ఛైర్మన్ ఆర్ ఎస్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ భారత ప్రభుత్వ మద్దతుతో తాము బ్రిటిష్ సంస్థను కొనుగోలు చేసినట్లుగా చెప్పారు. ఏడేళ్ల క్రితం వియత్నాంలో ఒకే ఒక ప్రాజెక్టును కలిగి ఉన్న ఓఎన్‌జీసి విదేశీ లిమిటెడ్ సంస్థ ప్రస్తుతం 17 దేశాల్లో 39 ప్రాజెక్టులను కలిగి ఉందని చెప్పారు.

రష్యాలోని పశ్చిమ సైబీరియా టోమ్స్క్ రీజియన్, ఉత్తర-మధ్య కజకిస్తాన్‌లోని కాస్టానై రీజియన్‌లో చమురు ఉత్పత్తి కేంద్రాలను కలిగి ఉన్న ఇంపీరియల్ ఎనర్జీ కొనుగోలు ద్వారా విదేశాల్లో ఓఎన్‌జీసి విదేశీ లిమిటెడ్ అతిపెద్ద విలీనంతో చరిత్ర సృష్టించిందని ఒఎన్‌జీసి ఛైర్మన్ ఆర్ ఎస్ శర్మ చెప్పారు.

మొత్తం కొనుగోలు, డీలిస్టింగ్ వ్యవహారం పూర్తవడానికి మరో రెండు లేదా మూడు వారాలు పడుతుందని ఓఎన్‌జీసి వర్గాలు తెలిపాయి.మ
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మరింతగా తగ్గనున్న విమానయాన ఛార్జీలు
పెట్రోలుపై 11 రూపాయలు తగ్గే అవకాశం
నూతన సంవత్సరంలో మాంద్యం తీవ్రతరం
సున్నా స్థాయికి పడిపోనున్న ద్రవ్యోల్బణం
మైక్రోసాఫ్ట్‌లో 9 వేల ఉద్యోగాలకు ఎసరు
పెరిగిన విదేశీ మారక ద్రవ్యనిల్వలు