ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > పదినెలల కనిష్ట స్థాయికి తగ్గిన ద్రవ్యోల్బణం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పదినెలల కనిష్ట స్థాయికి తగ్గిన ద్రవ్యోల్బణం
FILE
ద్రవ్యోల్బణం పది నెలల కనిష్టస్థాయిలో 6.38 శాతానికి పడిపోవడంతో 2009 నూతన సంవత్సరం సానుకూల వైఖరితో మొదలయింది. దీంతో పరిశ్రమను ప్రోత్సహించేందుకోసం భారతీయ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను మరింతగా తగ్గించగలదని పరిశ్రమ వర్గాల్లో ఆశలు పెరిగాయి.

డిసెంబర్ 20తో ముగిసిన వారాంతంలో ఆహారపదార్ధాలు, చమురు ధరలు మరింతగా తగ్గి 0,23 శాతం పడిపోవడంతో ద్రవ్యోల్బణం మరింతగా తగ్గిపోయింది. దీంతో వరుసగా 8వ నెలలో కూడా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినట్లయింది. డిసెంబర్ 7న ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ పన్ను తగ్గింపు కూడా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది.

డిసెంబర్ తొలి వారంలో కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీసెల్ ధరలను తగ్గించడం దవ్యోల్బణంపై అదనపు ప్రభావం కలిగించింది. డిసెంబర్ 20తో ముగిసిన వారాంతంలో టీ, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, దినుసులు, ఉప్పు, వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంధన ధరలు మొత్తంమీద 0.5 శాతం పడిపోవడం ద్రవ్యోల్బణంపై మంచి ప్రభావం చూపింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
విదేశీ కార్ల దిగుమతి ఇక సులభతరం
ఓఎన్‌జీసిచే ఇంపీరియల్ ఎనర్జీ కైవసం
మరింతగా తగ్గనున్న విమానయాన ఛార్జీలు
పెట్రోలుపై 11 రూపాయలు తగ్గే అవకాశం
నూతన సంవత్సరంలో మాంద్యం తీవ్రతరం
సున్నా స్థాయికి పడిపోనున్న ద్రవ్యోల్బణం