ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > బంగారం వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బంగారం వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా గతవారం జరిగిన సెన్సెక్స్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఢిల్లీ బులియన్ మార్కెట్లో గ్రాము బంగారు ధర 60 రూపాయలు పెరగగా వెండి కిలో 1,050 రూపాయలకు పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, డాలర్ మారక విలువ పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో బంగారు, వెండి ధరల్లో భారీగా మార్పులు జరిగాయి. గత సోమవారం ప్రతి ఔంస్‌కు 889.55 డాలర్లతో ప్రారంభం కాగా శుక్రవారం నాటికి ప్రతి ఔంస్‌కు 875.10 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో ముడిచమురు ధరలో మార్పు రావడం డాలర్ మారకం విలువ పడిపోవడంతో ప్రతి ఔంస్ బంగారు ధర 2.45 డాలరులు పెరిగింది.

ప్రపంచం ఆర్థిక వ్యవస్త ఒడిదుడుకులకు లోనవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరపై తప్పనిసరిగా ప్రభావంవుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినాకూడా మన ప్రజల్లో బంగారంపై మోజు తగ్గట్లేదని వారు తెలిపారు.

ఇదిలావుండగా బంగారం కన్నా కూడా వెండి మారకం విలువ గత సోమవారం ప్రతి ఔన్సుకు 11.23 డాలర్లతో ప్రారంభమై వారాంతానికి 0.23 డాలర్లకు పెరగి ప్రతి ఔన్సుకు 11.46 డాలర్ల వద్ద ముగిసింది.

మన దేశంలో బంగారం ధర అంతర్జాతీయ మారకం విలువపై ఆధారపడివుంటుంది. దీంతో మన మార్కెట్లో బంగారం ప్రతి పది గ్రాములు రూ. 13,000 లకు పైమాటే. కాబట్టి ఇప్పుడు ప్రజలు వెండి వస్తువులపై మోజు పెంచుకుంటున్నారు. ఈ వెండి వస్తువులను కూడా బంగారు ఆభరణాలవలె వాటికి మెరుగులుదిద్ది బంగారుపూత పూసి మరీ వాడుకుంటున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఓఎన్‌జీసిచే ఇంపీరియల్ ఎనర్జీ కైవసం
మరింతగా తగ్గనున్న విమానయాన ఛార్జీలు
పెట్రోలుపై 11 రూపాయలు తగ్గే అవకాశం
నూతన సంవత్సరంలో మాంద్యం తీవ్రతరం
సున్నా స్థాయికి పడిపోనున్న ద్రవ్యోల్బణం
మైక్రోసాఫ్ట్‌లో 9 వేల ఉద్యోగాలకు ఎసరు