ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ముడి చమురు మళ్లీ వేడెక్కుతోంది...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముడి చమురు మళ్లీ వేడెక్కుతోంది...
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ వేడెక్కనున్నాయి. ఇదివరకు ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గడంతో మన దేశంలో గత కొద్దిరోజులుగా లారీ, ట్రక్కు యజమానులు మన దేశంలో కూడా పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించాలని సమ్మె చేస్తున్న విషయం విదితమే.

కాని ఈ ఏడాది తొలి ట్రేడింగ్ రోజున ఎన్‌వైఎంసీలో లైట్ స్వీట్ క్రూడ్ ఫిబ్రవరి డెలివరీ కాంట్రాక్ట్ బ్యారెల్‌కు 1.74 డాలర్లు పెరిగి 46.34డాలర్లకు చేరింది.

ఉక్రెయిన్‌కు రష్యా సహజ వాయువు సరఫరా నిలిపివేయడం, అలాగే గాజాలో ఘర్షణలు ఏడో రోజుకు చేరుకోవడంతో గత శుక్రవారం (02.01.09)నాడు దాదాపుగా చమురు ధరలు 4 శాతం పెరిగాయి.

వ్యూహాత్మక చర్యల్లో భాగంగా అమెరికా 12 మిలియన్ బ్యారెళ్లను కొనుగోలు చేసే ఆలోచనలోవున్నట్లు ప్రకటించడంతో చమురు ధరలు పెరగడానికి ఊతమిచ్చాయి.

ఇదిలావుండగా భారత క్రూడ్ బ్యాస్కెట్ ధర శుక్రవారంనాటికి బ్యారెల్‌కు 5.38 డాలర్లు పెరిగి 41.96 డాలర్లకు చేరుకుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అమెరికా-భారత్ మధ్య భారీ ఆయుధ ఒప్పందం
బంగారం వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి...
మా వద్ద పెట్టుబడి పెట్టండి: మోడీ
రెండో ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
డాలర్ మారక రూపాయి పతనం
కేంద్రంచే నేడే రెండో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజి