ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఐఎమ్ఎఫ్ సరిగా వ్యవహరించలేదని కాబట్టి దీనిని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని భారత ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మెన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా చెప్పారు.
దావోస్ సమిట్‌లో పాల్గొన్న ఆయన ముఖ్యంగా ఈ విషయంపై ప్రసంగించారు. ప్రపంచంపై ఒక పెద్ద సంక్షోభం వచ్చి పడిందని, ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు ఇలాంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు పనిచేసే తీరుతెన్నులను పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.
ప్రపంచానికి ఐఎమ్ఎఫ్ లాంటి మరో కొత్త సంస్థ అవసరం ఉందని, మనం ఆర్థిక గాయాలకు కేవలం మందు పూస్తున్నామని అది మానడానికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించడంలేదని పేర్కొన్నారు. |