ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ఇప్పుడు పేద దేశాల్లోనూ కేంద్రీకృతమైందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. పేద దేశాలకు ఆర్థిక సంక్షోభం తరలిందని, ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలకు 2009లో 25 బిలియన్ డాలర్ల అదనపు నిధులు అవసరం అవతాయని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ఇంకా తీవ్రరూపం దాలిస్తే, 22 దేశాలకు సుమారు 140 బిలియన్ డాలర్ల నిధులు అవసరం అవతాయని ఐఎంఎఫ్ అంచనాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ముందు ఆర్థిక కష్టాలు పెరుగుతాయని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్యూ స్ట్రాస్ ఖాన్ తెలిపారు. ఆర్థిక సంక్షోభం మూడో దశలో ఆర్థిక, రుణ మార్కెట్‌ల నుంచి వినియోగదారుల మార్కెట్‌కు వ్యాప్తి చెందుతుందన్నారు. |