ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > టైటాన్ మరో 40 దుకాణాలను ప్రారంభిస్తుంది
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
టైటాన్ మరో 40 దుకాణాలను ప్రారంభిస్తుంది
టాటా సంస్థకు చెందిన టైటాన్ ఇండస్ట్రీస్ రానున్న ఏడాది మార్చి నెల లోపల దాదాపు 40 దుకాణాలను ప్రారంభించాలని ప్రణాళికలను రూపొందించింది.

టైటాన్ తన నూతన షోరూంలకోసం చెన్నై, ఢిల్లీ, కోలకతా, సేలం, పుణే, మహారాష్ట్ర తదితర ప్రముఖ ప్రాంతాలలో స్థలాలను ఎంపిక చేసినట్లు కంపెనీ ప్రధాన ఆర్థికాధికారి (సీఎఫ్ఓ) హరీష్ భట్ట్ తెలిపారు.

కంపెనీ దాదాపు 40 షోరూంలను ప్రారంభించడానికి ప్రణాళికలను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో సగానికిపైగా కంపెనీ భాగస్వామ్యంవుంటుందని, మిగిలినవి ఫ్రాంచైజీలకు అప్పగించనున్నామని ఆయన పేర్కొన్నారు.

వరల్డ్ ఆఫ్ టైటాన్ షోరూంలలో ప్రతి షోరూంకొరకు 50 లక్షల రూపాయలను నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీ అధ్వర్యంలో దాదాపు 260 షోరూంలు నడుస్తున్నాయని, మార్చి నెల చివరికి అవి 275కు చేరుకుంటాయని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అమెరికాలో మరో బ్యాంకు మూసివేత
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
ఈ వారంలో సత్యం కంప్యూటర్స్ విక్రయం
కార్పొరేట్ పారదర్శకత జాబితాలో సిటీ, పెప్సికో
ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుంది: ఒబామా హామీ
ఏడిబి సమావేశానికి భారత్ ప్రతినిధులు