ప్రస్తుతం ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న సిటీ గ్రూప్‌కు చెందిన అధికారులు రెండు రోజులలో దాదాపు 97 లక్షల డాలర్ల విలువ కలిగిన షేర్లను విక్రయించారు.
సిటీ గ్రూపుకు చెందిన డైరెక్టర్లలోని ప్రముఖుడు సర్ విన్ బిస్చౌఫ్‌తోబాటు మరో ఐదుమంది అధికారులు గత రెండు రోజులలో 77 లక్షల షేర్లను అమ్మేశారు. వీటి విలువ దాదాపు 97 లక్షల డాలర్లుంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు.
ఇంత పెద్ద మొత్తంలో తమ షేర్లను మార్చి నెల 2, 3వ తేదీలలో అమ్మినట్లు సెక్యూరిటీ అండ్ ఎక్స్‌చేంజ్ కమీషన్ కంపెనీ తెలిపింది. విక్రమ్ పండిట్‌కు చెందిన సిటీ గ్రూప్ షేర్లు గతవారంలో ఒకడాలరుకన్నా తక్కువకు దిగజారాయి. న్యూయార్క్‌లోని స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మార్చినెల ఆరవ తేదీకి కంపెనీ షేరు ధర 1.03 డాలరుకు చేరుకుంది. |