గత శుక్రవారం సెబీ సత్యం వాటాలను అమ్మడానికి అనుమతినివ్వడంతో ఆ కంపెనీలోని వాటాలను పెంచుకోవడానికి పలు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ షేర్ల ధరలు సోమవారం ఊపందుకున్నాయి.
సత్యం షేర్ల ధరలలో ప్రతి షేరు ధర రూ. 35నుంచి రూ. 42.10కి చేరుకుంది. ఇది దాదాపు 20శాతం పెరిగినట్లు షేర్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
సోమవారం ప్రారంభంలోనే సత్యం షేర్లను కొనడానికి మదుపుదారులు ఎగబడుతున్నారని, వారం తొలిరోజులోనే 14.61శాతానికి చేరుకున్నట్లు విశ్లేషకులు తెలిపారు. ఉదయం పదకొండుగంటలకే ప్రతిషేరు ధర 14.61 శాతం చేరుకుని రూ. 48.30కి చేరుకుంది.
ఇదిలావుండగా కేఎల్‌జీ సిస్టెల్ షేర్ల ధరలలోకూడా 11శాతం పెరిగినట్లు సమాచారం. |