పాకిస్థాన్‌లో హింసాత్మక పరిస్థితుల కారణంగా దేశీయ వ్యాపారులకు ఆ దేశంపై ఆసక్తి బాగా క్షీణిస్తోందని ఫిక్కీ నిర్వహించిన సర్వేలో తేలింది. రాబోయే నెలల్లో పాకిస్థాన్- భారత్ మధ్య వాణిజ్యం బాగా దెబ్బతింటుందని ఫిక్కీ పేర్కొంది. 2009-10లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 60 శాతం మేర క్షీణించి, 900 మిలియన్ డాలర్లకు పరిమితం అవుతుందని ఫిక్కీ సర్వే నివేదిక అంచనా వేసింది.
ప్రస్తుతం ఇరుదేశాల మధ్య వాణిజ్య విలువ రెండు బిలియన్ డాలర్ల వద్ద ఉంది. అయితే భారత ఎగుమతిదారులు పాక్ వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పాకిస్థాన్‌తో వ్యాపారం సాగిస్తున్న ఎగుమతిదారులు, దిగుమతిదారులు వద్ద ఫిక్కీ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పాక్‌లో హింసాత్మక పరిస్థితులను చూసి భారత వ్యాపారులు భీతిల్లుతున్నారని ఫిక్కీ వెల్లడించింది. |