ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > నానో ఆన్‌లైన్ బుకింగ్ కోసం వెబ్‌సైట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నానో ఆన్‌లైన్ బుకింగ్ కోసం వెబ్‌సైట్
దేశ ఆటోమొబైల్ రంగ చరిత్రలోనే ప్రథమంగా నానో కార్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు వీలుగా టాటా మోటార్స్ సంస్థ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఒక వెబ్‌సైట్‌ను సైతం ఆరంభించింది. నానో కారును కొనుగోలు చేయదలచుకున్న వారికి అందుకు తగిన విధివిధానాలు ఈ సైటులో లభ్యమవుతాయి. ఏప్రిల్ 9 - 25 తేదీల మధ్య నానో కోసం అభ్యర్ధించే బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

భవిష్యత్ వ్యాపార ధోరణులను దృష్టిలో ఉంచుకుని టాటా మోటార్స్ పద్ధతిని ఎంచుకున్నట్లు ఆటోరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధమైన ఆన్‌లైన్ బుకింగ్ పద్ధతికి మంచి స్పందన రాగలదని ఆయన అంచనా వేస్తున్నారు. తీరికలేని పలువురు వ్యక్తులకు ఆన్‌లైన్ బుకింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అదే సమయంలో ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా చాలా సమయం ఆదా అవుతుందని వారు అంటున్నారు.

ఆన్‌లైన్ బుకింగ్‌లో దరఖాస్తు ఫీజు కేవలం 200 రూపాయలు మాత్రమే. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వెస్ట్ వైడ్ అప్పారల్ స్టోర్స్, టైటాన్ షో రూమ్‌ల్లో నానో అప్లికేషన్ ఫార్మ్స్‌కు 300 రూపాయలు ఖర్చవుతుంది. ఆన్‌లైన్ వర్చువల్ షో రూమ్‌లో నానో కారుకు సంబందించిన పలు విశిష్టతలను తీరిగ్గా పరిశీలించే అవకాశముంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మార్కెట్‌లో కోడిగుడ్లు ధరలు
ఏప్రిల్ ఒకటి నుంచి సర్వీసు ఛార్జీ రద్దు
కోల్‌కతా-లండన్ ఏఐ సర్వీసులు పునరుద్ధరణ
ద్విచక్రవాహనాలపై ప్రభావం చూపనున్న నానో
ఏటీఎమ్ నెట్‌వర్క్ కోసం కొత్త కంపెనీ: ఐసీఐసీఐ
బంగ్లాదేశ్‌కు విమాన సర్వీసులు రద్దు చేసిన బ్రిటీష్