ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > జనరల్ మోటార్స్‌కు కొత్త సీఈఓ హెండర్సన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జనరల్ మోటార్స్‌కు కొత్త సీఈఓ హెండర్సన్
ప్రపంచ ఆటో రంగ దిగ్గజం జనరల్ మోటార్స్ సంస్థకు కొత్త సీఈఓను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. ప్రస్తుత జీఎం, ఛైర్మన్‌, సీఈఓగా విధులు నిర్వహిస్తూ వచ్చిన రిక్ వాగొనర్‌ తన జోడు పదవుల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఫ్రిట్జ్ హెండర్సన్‌ను కొత్త సిఈఓగా నియమించినట్టు జిఎమ్ సంస్థ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈయన వైస్ ఛైర్మన్‌గాను, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఆయన జోడు పదవులు నిర్వహిస్తూ వచ్చారు.

దెబ్బతిన్న అమెరికా ఆటోమొబైల్ రంగాన్ని తిరిగి పట్టాలెక్కించే భవిష్యత్ పథకాన్ని ప్రకటించేందుకు ఒకరోజు ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒబామా ప్రభుత్వం సోమవారం సరికొత్త ఆటోమొబైల్ పథకాన్ని ప్రకటించనుంది. జనరల్ మోటార్స్, క్రిస్లర్ సంస్థలు బెయిల్ ఔట్ ప్యాకేజి నుంచి కోట్లాది డాలర్లను ఆర్జించాయే కానీ, కంపెనీల్లో తగినంత పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టలేదని ఒబామా ప్రభుత్వం ఆ కంపెనీలను తప్పుపట్టింది.

పుర్నిర్మాణం విషయంలో వెనకబడిపోయినందుకు ఆ రెండు కంపెనీలను ఒబామా ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాకుండా ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంపై ఒబామా టాస్క్ ఫోర్స్ తీవ్రంగా కృషి చేస్తోంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన మూల స్థంభంగా ఉన్న ఆటోమొబైల్ పారిశ్రామిక రంగం ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కారణంగా కుప్పకూలిన విషయం తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గుజరాత్‌లో మేటాస్ గ్యాస్‌ పైప్‌లైన్ పూర్తి
నానోకు రుణం ఎక్కడినుంచైనా తీసుకోవచ్చు
రూ.800 కోట్ల నిధుల చెల్లింపునకు అంగీకారం
ముడి చమురు ఉత్పత్తిని నిలిపి వేసిన రిల్
రాజుపై ఏప్రిల్ మొదటి వారంలో ఛార్జిషీటు: సీబీఐ
విమాన ఛార్జీలు తగ్గించండి: ఎయిర్‌లైన్స్