ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > కలర్ టీవీ ధరలు పెరగనున్నాయి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కలర్ టీవీ ధరలు పెరగనున్నాయి
కలర్ టీవీలకు చెందిన పిక్చర్ ట్యూబ్‌లను తయారు చేసే కంపెనీలు సిమ్‌టెల్, జీసీటీ లాంటి కుటీర పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడానికి ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్న కలర్ పిక్చర్ ట్యూబ్‌లపై ప్రత్యేకమైన పన్నును విధించింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు రాయితీలు అందనుంది. కాని వినియోగదారులకు మాత్రం ఇదివరకు తాము కొనుక్కున్న టీవీ ధరలకన్నా కూడా ప్రస్తుతం రాబోయే టీవీలు మాత్రం అధిక ధరలకు రానున్నాయి.

ప్రస్తుతం కలర్ టీవీలను తయారు చేస్తున్న ఎల్‌జీ, ఒనిడాలాంటి కంపెనీలు పిక్చర్ ట్యూబ్‌ను దిగుమతి చేసుకుంటుంటాయి. కలర్ పిక్చర్ ట్యూబ్‌ను దిగుమతిపై ప్రత్యేక పన్నును విధించడంతో టీవీల ధరలలో పెను మార్పులు సంభవించనున్నట్లు కన్జ్యూమర్ ఎలెక్ట్రానిక్ అండ్ అప్లయెన్సెస్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ ఖన్నా తెలిపారు.

టీవీకి ప్రధానమైంది పిక్చర్ ట్యూబ్ కాబట్టి టీవీ ధరలు పెరుగుతాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయ కలర్ పిక్చర్ ట్యూబ్ ఇండస్ట్రీస్‌లో ప్రతి నెల పది లక్షలకన్నాకూడా తక్కువగానే పిక్చర్ ట్యూబ్‌లు తయారవుతాయని, అలాగే ప్రతి నెల మార్కెట్లో టీవీలు దాదాపు పది లక్షలకన్నా అధికంగా తయారౌతున్నాయని ఆయన తెలిపారు. ఈ లోటును భర్తీ చేయడానికి పిక్చర్ ట్యూబ్‌లను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

దీంతో స్పెషల్ డ్యూటీని చెల్లించాల్సివుంటుంది. స్పెషల్ డ్యూటీని యాంటీ డంపింగ్ డ్యూటీ అనికూడా అంటారు. ఏదేనీ దేశంనుంచి తక్కువ ధరకు వస్తువులను దిగుమతి చేసుకుంటే వాటికి స్పెషల్ డ్యూటీని ప్రభుత్వానికి చెల్లించాలి. దేశీయ ఉత్పత్తులకు భద్రత కల్పించేందుకుగాను విదేశీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి విధించే సుంకమే ఇది అని ఆయన వివరించారు.

విదేశాలనుంచి దిగుమతి చేసుకునే పిక్చర్ ట్యూబ్‌ల వలన దేశీయ కుటీర పరిశ్రమలకు భారీగా నష్టం వాటిల్లుతుందని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ కారణంగానే పిక్చర్ ట్యూబ్‌ల దిగుమతిపై ప్రభుత్వం ప్రత్యేక సుంకం విధించిందని వారు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మారనున్న నియామకపు ప్రక్రియ
కార్ల కంపెనీలకు సహాయ నిరాకరణ: ఒబామా
ఆర్థిక సంక్షోభ పరిష్కారంలో భారత్‌దే కీలక పాత్ర..!
రాన్‌బాక్సీకి గత ఏడాది రూ.1045 కోట్ల నష్టం
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
జనరల్ మోటార్స్‌కు కొత్త సీఈఓ హెండర్సన్