ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎల్‌అండ్‌టి రూ.1143 కోట్ల విలువ చేసే భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. భూటాల్‌లో పునత్సంగచు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు వద్ద నిర్మాణానికి సంబంధించిన పనుల కోసం ఈ భారీ ప్రాజెక్టు ఎల్‌అండ్‌టి పొందినట్టు కంపెనీ తెలిపింది.
1200 మెగావాట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా డ్యామ్ ప్యాకేజీ నిర్మాణం కోసం ఎల్‌అండ్‌టి ఈ ఆర్డరును దక్కించుకుంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ నూతన ప్రాజెక్టును 66 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్డరును దక్కించుకున్న తర్వాత బిఎస్‌ఈపై ఎల్‌అండ్‌టి షేరు విలువ 0.65 శాతం పెరిగింది.
నిర్మాణ పనులకు గాను భూటాన్ నుంచి రూ.689 కోట్ల విలువ చేసే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ హెచ్‌సిసి పొందింది. పశ్చిమ భూటాన్‌లో పునత్సంగచు నదిపై ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు కంపెనీ తెలిపింది.
పునత్సంగచు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు వద్ద నిర్మాణం కోసం ఆర్డరును పొందడం చాలా సంతోషంగా ఉందని హెచ్‌సిసి అధ్యక్షుడు, సీఓఓ వినాయక్ దేశ్‌పాండె అన్నారు. ఈ ప్రాజెక్టును 66 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. |