ఈనెల ఐదో తేదీ ఆదివారం ఇస్లామిక్ బ్యాకింగ్ విధానంపై ఒక సెమినార్ జరుగనుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో జరిగే ఈ సదస్సు ముస్లిం ఇనిస్టిట్యూట్‌లో ఉర్దు ఎడిషన్ ఆఫ్ ది సండే ఇండియన్ అనే సంస్థ నిర్వహిస్తోంది. దీనిపై ఆ సంస్థ ప్రతినిధి డానిష్ రియాజ్ శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇస్లామిక్ ఫైనాన్స్‌పై వివిధ రకాల ప్రాథమిక సిద్ధాంతాలు, సమకాలీన సమస్యలు తదితర అంశాలపై చర్చ సాగుతుందని తెలిపారు. దేశంలోని వివిధ ఆర్థిక సంస్థలకు చెందిన ప్రతినిధులు, సీఈఓలు సదస్సుకు హాజరై ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానంపై ప్రత్యేక ప్రసంగాలు చేస్తారని పేర్కొన్నారు. |