వాహనాలు, నిర్మాణ రంగాలలో అధికమైన స్టీల్ అవసరమైన సందర్భంలో దేశంలోని టాటా స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం 2008-09వ సంవత్సరంలో దాదాపు 14శాతానికి పెరిగింది. ఇది 62.5 లక్షల టన్నులకు చేరుకుంది. ఇదే 2007వ సంవత్సరంలో 52.3 లక్షల టన్నులుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరంలో టాటా స్టీల్స్ అమ్మకాలు 9.0శాతం పెరిగి 52.3 లక్షల టన్నులకు చేరుకుందని కంపెనీ ప్రకటించింది. అదే 2007వ సంవత్సరంలో ఈ అమ్మకాలు 16 లక్షల టన్నులకు చేరుకుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఆటో మొబైల్ రంగంలో వాడేటటువంటి వస్తువులకు చెందిన స్టీల్ ప్లేట్ల ఉత్పత్తికూడా సాధారణంగా పెరిగి 1.25శాతానికి చేరుకుని 32.2 లక్షల టన్నులకు చేరుకుందని కంపెనీ అధికారులు తెలిపారు. |