ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > 110 మందికి ఉద్వాసన పలికిన జెట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
110 మందికి ఉద్వాసన పలికిన జెట్
దేశంలోని కారుచౌక ప్రైవేట్ విమానయాన సంస్థల్లో అగ్రస్థానంలో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ తన సంస్థలో పనిచేస్తున్న 110 మందికి ఉద్వాసన పలికింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే డే రోజునే ఈ చర్య చేపట్టడం గమనార్హం. ఈ విషయమై ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ పెరుగుతున్న వ్యయాలు, తగ్గుతున్న ఆదాయం కారణంగా 110 మంది ఉద్యోగులకు ఉద్వాసన సూచికలైన పింక్ స్లిప్‌లు ఇచ్చినట్టు తెలిపారు.

పింక్ స్లిప్‌లు అందుకున్న వారిలో 50 మంది కాంట్రాక్టు ఉద్యోగులు కాగా, మిగిలినవారు ప్రొబేషనరీ కాబిన్ సిబ్బందిగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. సంస్థ చేపట్టిన ఈ తొలగింపులు దేశంలోని చట్టాలు, సర్వీసు నిబంధనలకు అనుగుణంగానే జరిగినట్టు ఆయన తెలిపారు.

వారం రోజుల క్రితం జెట్ ఎయిర్‌వేస్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో 75 వేలకు పైబడి వేతనం అందుకుంటున్నవారి జీతాల్లో 25 శాతం మేర కోత విధించగా తాజాగా ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
15శాతం పెరిగిన మారుతీ అమ్మకాలు
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
42 శాతం ఆదాయాన్ని అర్జించిన మూసర్ బీర్
హీరోహోండా విక్రయాలు 30 శాతం వృద్ధి
33 శాతం మేరకు క్షీణించిన ఎగుమతులు
దివాళా దరఖాస్తు దాఖలు అమెరికా కంపెనీ