ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > మార్కెట్లోకి కొత్త రకం ట్రక్కులు: టాటా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మార్కెట్లోకి కొత్త రకం ట్రక్కులు: టాటా
మోటార్ వాహనాల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న టాటా మోటార్స్ అంతర్జాతీయ స్థాయిలో నూతన ట్రక్కుల నిర్మాణం చేపట్టినట్లు కంపెనీ ప్రకటించింది. కొత్తగా తయారు చేసే ట్రక్కులో 10నుంచి 75 టన్నుల బరువును తీసుకువెళ్ళగలిగేలా ట్రక్కులను రూపొందించామని ఇది పలువిధాలుగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.

నూతనంగా తయారుచేయబోయే ట్రక్కులలో బరువును మోయడంతోబాటు మంచి వేగంకూడా కలిగి ఉంటుందని దీనిని అంతర్జాతీయ స్థాయి ప్రామాణికాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చెసినట్లు కంపెనీ తెలిపింది.

అంతర్జాతీయ స్థాయి నాణ్యతాప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందిస్తున్నామని, దీనిని తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తామని టాటామోటర్స్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ పీ.ఎమ్. తెలంగ్ గురువారం మీడియాకు వెల్లడించారు.

శుక్రవారంనాడు టాటా సంస్థ ఛైర్మెన్ రతన్ టాటా ప్రాథమికంగా వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తారని ఆయన తెలిపారు. వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు ఏడాదిలోపు వీటిని వినియోగదారులకు అందివ్వనున్నట్లు తెలంగ్ తెలిపారు.

ఇదిలావుండగా దేశీయంగా రూపొందించిన వీటిని ఏడాదికి 55 వేల వాహనాలను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన వివరించారు. కాగా ప్రముఖంగా ఈ వాహనాలను జమ్‌షెడ్‌పుర్‌లోని కర్మాగారంలో వీటికి రూపకల్పన చేసి నిర్మాణం చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి దాదాపు 1000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఈ వాహనాలను దక్షిణ కొరియాకు చెందిన టాటా డియో వాహన నిర్మాణాల కంపెని, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని టాటా మోటార్స్‌కు చెందిన ఇంజనీర్ల సహాయంతో వీటి నిర్మాణం చేపట్టినట్లు ఆయన వివరించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
0.61 శాతం వద్దే ద్రవ్యోల్బణం
550 శాతం లాభాన్ని ఇస్తాం: జిందాల్
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
రేట్ల తగ్గింపుపై బ్యాంకులతో మాట్లాడతాం: ప్రణబ్
నానోకు పోటీగా ఆల్టో!
జులై మొదటి వారంలో బడ్జెట్‌: ప్రణబ్‌