ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > వస్త్ర పరిశ్రమ ఎగుమతులు తగ్గుముఖం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వస్త్ర పరిశ్రమ ఎగుమతులు తగ్గుముఖం
2008-09 ఆర్థిక సంవత్సరంలో వస్త్ర పరిశ్రమ ఎగుమతులు సుమారు 2 శాతం మేరకు తగ్గుముఖం పట్టినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగానే ఈ వస్త్ర పరిశ్రమ ఎగుమతులు తగ్గుముఖం పట్టినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచంలోని వివిధ దేశాలు కష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంతో అమెరికా మరియు యూరప్ వంటి ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్
పడిపోయిందని.. అందుకే వస్త్రాల ఎగుమతులు తగ్గిపోయాయని వస్త్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

2007-08 ఆర్థిక సంవత్సరంలో వస్త్రాల ఎగుమతులు 22.13 బిలియన్ డాలర్ల వద్ద ఉండేది. అయితే 2008-09 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 21.75 బిలియన్ డాలర్లకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో వరుసగా ఆరునెలల్లో ఆరోగ్యకరమైన వృద్ధి రేటును నమోదు చేసిన వస్త్రాల ఎగుమతులు గత ఏడాది అక్టోబర్ నుండి తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది.

ఈ క్షీణత సుమారు 1.7 శాతం మేరకు ఉండవచ్చని వస్త్ర మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో చేతివృత్తుల పరిశ్రమ 42 శాతం మేరకు పడిపోవడం దాని ప్రభావం వస్త్రరంగంపై తీవ్రంగా ప్రభావం చూపింది. అయితే ఆర్థిక సంక్షోభం నెమ్మదిస్తుండటంతో త్వరలోనే వస్త్రరంగంలో ఎగుమతులు తిరిగి పుంజుకోగలవని వస్త్రమంత్రిత్వ శాఖ అంచనా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
లాభాలు పెంచుకున్న అమూల్
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
మరో రెండు నెలల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ త్రీజీ సేవలు
18శాతం పెరిగిన టాటాస్టీల్ అమ్మాకాలు
నేషనల్ ఇన్స్యూరెన్స్ అధ్యక్షునిగా చంద్రప్రసాద్
పెరిగిన ప్రత్యక్ష పన్నుల రాబడి