ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > వడ్డీ రేట్లు తగ్గింపును పరిశీలిస్తాయి: ముఖర్జీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వడ్డీ రేట్లు తగ్గింపును పరిశీలిస్తాయి: ముఖర్జీ
వడ్డీ రేట్లు తగ్గించే ప్రతిపాదనలు పరిశీలించేందుకు బ్యాంకులు అంగీకరించాయని ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో ప్రణబ్ ముఖర్జీ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక ప్రదర్శనను మెరుగుపరిచేందుకు వడ్డీ రేట్లు తగ్గించాలని ప్రణబ్ ముఖర్జీ బ్యాంకులకు సూచించారు.

బ్యాంకులను ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ప్రణబ్, పరిశ్రమ వర్గాలకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందించాలని సూచించారు. వడ్డీ రేట్ల తగ్గింపు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు బ్యాంకులు అంగీకరించాయని తెలిపారు. వడ్డీ రేట్లు తగ్గించకుండా అన్నిరంగాలు అభివృద్ధి బాటలో నిలవడం సాధ్యం కాదని ప్రణబ్ అభిప్రాయపడ్డారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వడ్డీ రేట్లు తగ్గించండి: ప్రణబ్ సూచన
కేంద్రం గ్రీన్‌సిగ్నల్ కోసం వేచిచూస్తున్న ఎస్‌బీఐ
గ్యాసు కొనుగోలుకు ఎన్టీపీసీ సుముఖత
చూసేందుకే 'కోడిగుడ్డు'... పట్టుకుంటే ధర భగ్గు
మార్కెట్లో కోడిగుడ్లు ధరలు
8-9 శాతం వృద్ధి తథ్యం: మన్మోహన్ సింగ్