ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > మాంద్యంలోకూడా ఆన్‌లైన్ అమ్మకాలు...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మాంద్యంలోకూడా ఆన్‌లైన్ అమ్మకాలు...!
ఆర్థికమాంద్యం కారణంగా నిరుడు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కేవలం భారతదేశంలోనే ఆన్‌లైన్ అమ్మకాల్లో 42శాతం వృద్ధిని సాధించాయి.

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత దేశ వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా తమకు కావలసిన వస్తువులను కొన్నట్లు సర్వేలో తేలింది. ఇది 3442 కోట్ల డాలర్లకు చేరుకుంది.

నిరుడు ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఆన్‌లైన్ ఖర్చు 2419 డాలర్లు ఉండగా నాల్గవ(చివరి)త్రైమాసికంలో అమ్మకాలు పెరిగినట్లు వీజాకు చెందిన ఈ-కామర్స్ పేర్కొంది.

ఆన్‌లైన్ ద్వారా వస్తువులను కొనే దేశాలలో భారతదేశంలోని ప్రజలు మూడవ స్థానంలో ఉన్నారని సర్వేలో తేలినట్లు ఆ సంస్థ ప్రకటించింది. గత సంవత్సరం(2008)లో సింగపుర్ దేశ ప్రజలు 4018 డాలర్లకు వస్తువులను కొని ప్రథమ స్థానంలో ఉన్నారని దీని తర్వాతి స్థానం హాంగ్‌కాంగ్ కాగా మూడవ స్థానంలో భారత దేశప్రజలున్నారని ఆ సర్వే సంస్థ తెలిపింది.

మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న నేటి తరుణంలో ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యాపారం సజావుగా జరగడం ఆశ్చర్యంగానే ఉందని వీజా కంట్రీ మేనేజర్(దక్షిణ ఆసియా)ఉత్తమ్ నాయక్ తెలిపారు.

దీనికంతటికి ప్రధాన కారణం వినియోగదారులు తమకు కావలసిన పదార్థాలు, వస్తువుల ధరలను చూసి బేరీజు వేసుకుంటున్నారని, ఏది తక్కువగా ఉంటే దానినే వారు కొంటున్నారని ఆయన తెలిపారు. అలాగే తమ బడ్జెట్‌కు తగ్గట్టుగా వారికి కావలసిన వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొనే సౌకర్యం ఉండటంమూలాన వారికి మరింత సులభతరమైందని ఆయని అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండగా గత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికపు నెలలతో పోల్చి చూస్తే చివరి త్రైమాసికంలో ఆన్‌లైన్ అమ్మకాల్లో వృద్ధి చెందిందని ఆయన తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
2009-10లో 1.3 మిలియన్ ఉద్యోగాలకు గండి
విమాన ప్రయాణఛార్జీలు తగ్గించనున్న ఏఐ
1.4% పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం
వ్యాపారం ఎలాచేయాలి: ఎపిఎస్‌ఎఫ్‌సి ప్రచారం
బీపీఎల్ఆర్ సమీక్షకు ఆర్‌బీఐ సిద్ధం
తగ్గిన ద్రవ్యోల్బణం: 0.13శాతంగా నమోదు