అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిన నేపథ్యంలో ఏప్రిల్‌లో దేశ పారిశ్రామిక వృద్ధిరేటు 1.4 శాతంగా నమోదయ్యింది. అంతకుముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా ప్రతికూల వృద్ధిరేటు కనిపించినా ఏప్రిల్‌లో కోలుకున్న సంకేతాలు కనిపించడం విశేషం.
అయితే గత ఏడాది ఇదే సమయానికి వృద్ధిరేటు 6.2 శాతంగా ఉండడం గమనార్హం. మరోవైపు విద్యుత్ ఉత్పాదకత వృద్ధి రేటు మాత్రం పైపైకి దూసుకుపోతుండడం విశేషం. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పాదకత వృద్ధి రేటు 7.1 శాతంతో అన్ని రంగాల వృద్ధి కంటే ముందు స్థాయిలో కొనసాగుతోంది.
అదేసమయంలో దీర్ఘకాలికేతర వినియోగదారుల ఆహార ఉత్పత్తులు, క్యాపిటల్ గూడ్స్ వంటివి మాత్రం ప్రతికూల వృద్ధిరేటును నమోదు చేశాయి. |