ఆర్థిక మాంద్యం పుణ్యమాని నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ సంస్థకు అవసరమైన సాయం చేసేందుకు కేంద్రం అంగీకరించిందని ఎయిర్ ఇండియా ఛైర్మన్, ఎండీ అరవింద్ జాదవ్ సూచన ప్రాయంగా వెల్లడించారు.
ఆయన శనివారం కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి కేఎం.చంద్రశేఖర్‌తో సమావేశమై, సంస్థ పరిస్థితిని వివరించారు. జులై నెల జీవభత్యాలను తీసుకోవద్దని, అలాగే, సంస్థకు చెందిన 30 వేల మంది సిబ్బందికి జూన్ జీతాలను ఇతర ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహకాలను 15 రోజుల ఆలస్యంగా చెల్లిస్తామని ఎయిర్ ఇండియా ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.
సంస్థ నష్టాలు గత యేడాది నాలుగు వేల కోట్ల రూపాయలుగా లెక్క తేలాయి. ఈ సంవత్సరం నష్టాలను ఇంకా తేల్చాల్సి వుంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం కారణంగా సంస్థ తీవ్రస్థాయిలో నష్టాలను ఎదుర్కోంటోంది. దీంతో నిధుల సమీకరణకు సంస్థ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. |