ప్రస్తుతం ఉద్యోగ రంగంలో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్షేత్రంలో(ఐపీ) శిక్షణ తీసుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రానున్న రెండు...మూడు సంవత్సరాలలో దాదాపు 25వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రంగం రానున్న రెండు...మూడు సంవత్సరాలలో 25వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. చట్టసంబంధమైన ఫర్మ్‌లు, నాలెడ్జ్ అండ్ లీగల్ ప్రోసెస్, ఔట్ సోర్సింగ్ కంపెనీలు, ఇతర కుటీర పరిశ్రమలలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి చెందిన నిపుణుల అవసరం ఏర్పడనుందని గ్లోబల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రధాన కార్యనిర్వహణాధికారి అతుల్యనాథ్ తెలిపారు.
కంపెనీల మధ్య పోటీని పెంచడానికి ఐపీ అధికారుల అవసరం ఏర్పడనుందని, దీంతో పేటెంట్ ట్రేడ్ మార్క్ తదితరాలగురించి కంపెనీలకు వివరించే అధికారుల అవసరం ఏర్పడనుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
రానున్న రోజుల్లో ఐపీ రంగం గణనీయంగా విస్తరించనుందని, దీనికి సంబంధించి న్యాయశాస్త్ర విద్యనభ్యసించినవారికి మరిన్ని అవకాశాలున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో వీటి డిమాండ్ బాగా ఉందని కాని భారతదేశంలో ఇంకా ఐపీ వృత్తిదారులు తక్కువగా ఉన్నారని కాబట్టి రాబోయే రోజుల్లో వీటికి మంచి డిమాండ్ ఏర్పడే అవాకాశాలు ఎక్కువగా ఉన్నాయని లా ఫర్మ్ లాల్ లాహినీ అండ్ సల్హోత్రా పార్ట్‌నర్ రాహుల్ ఛౌధరి పేర్కొన్నారు. |