దక్షిణ భారతదేశంలో మీడియా రంగంలో అగ్రగామిగానున్న సన్ టీవీ నెట్‌వర్క్ సంస్థ నికరలాభం 13శాతానికి పెంచుకుని రూ. 368.33 కోట్లకు చేరుకుంది.
గత ఆర్థిక సంవత్సరానికి తమ సంస్థకు నికర లాభం 13శాతం పెరిగి రూ. 368.33 కోట్లకు చేరుకుందని సన్ టీవీ నెట్‌వర్క్ సంస్థ ప్రకటించింది.
తమ సంస్థ నికర లాభం 2007-08 ఆర్థిక సంవత్సరంలో రూ. 326.69 కోట్లుగా ఉండిందని, నిరుడు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 13శాతం పెరిగి రూ. 368.33 కోట్లకు చేరుకుందని సన్ నెట్‌వర్క్ సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.
తమ సంస్థలోని ప్రింట్ మీడియా, ఎఫ్ఎమ్ రేడియో సర్వీసులు, టెలివిజన్ ఛానల్స్ ద్వారా వచ్చిన ఆదాయం నిరుడు ఆర్థిక సంవత్సరంలో రూ. 1,106.16 కోట్లకు చేరుకుంది. ఇదే అంతకు మునుపు ఆర్థిక సంవత్సరంలో రూ. 925.54 కోట్లుగా ఉండందని కంపెనీ ప్రకటించింది.
ఇదిలావుండగా మీడియాలోనున్న తమ షేర్ హోల్డర్లకు లాభాలలోనుంచి ప్రతి షేరు ధర రూ. 1టిపై 20శాతం డివిడెండును ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
కాగా కేవలం సన్ నెట్‌వర్క్ నికర లాభం రూ. 437.11 కోట్లకు చేరుకుంది. ఇదే గత ఆర్థిక సంవత్సరంలో రూ. 366.98 కోట్లుగా ఉండిందని సంస్థ తెలిపింది. |