సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయిన మై స్పేస్ ప్రపంవ్యాప్తంగానున్న తన ఉద్యోగులలో దాదాపు 300మందిని తొలగించనుంది. మై స్పేస్ సంస్థ మూడు వందలమంది ఉద్యోగులను తొలగించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగానున్న తన శాఖలలోని నాలుగు కార్యాలయాలను మూసివేయనుంది. దీంతోపాటు భారతదేశంలో మాత్రం కార్యక్రమాలను పటిష్టం చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. న్యూస్ కార్పోరేషన్‌లో భాగస్వామ్యమున్న మై స్పైస్ సంస్థ నాలుగు దేశాలలో మరింత ప్రణాళికాబద్దంగా కార్యకలాపాలను కొనసాగించనుందని లండన్‌కు చెందిన ది టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆ సంస్థలో ప్రస్తుతం 450మంది ఉద్యోగులుండగా వీరిలో మూడు వందలమేందిని తొలగించి 150మందితోనే ఈ పనిని చేయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇదిలావుండగా కంపెనీ భారత్, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, ఫ్రాంస్, ఇటలీ, మెక్సికో, రష్యా, స్వీడన్ మరియు స్పెయిన్ దేశాలలోనున్న తన కార్యాలయాలను పునర్వ్యవస్థీకరిస్తామని కంపెనీ తెలిపింది. |