భారతీయ జీవిత బీమా సంస్థ 50వేల కోట్ల రూపాయలకు షేర్లు కొనుగోలు చేయనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాము వివిధ కంపెనీల్లో దాదాపు రూ. 50వేల కోట్లకుగాను షేర్లను కొనుగోలు చేయనున్నట్లు భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) తెలిపింది.
తమ సంస్థ దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేరకు వివిధ కంపెనీలలోని షేర్లను కొననున్నట్లు ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ థామస్ మైథ్యూ తెలిపారు. నిరుడు ఇది 48వేల కోట్లకు షేర్లు కొన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఎల్ఐసీ ఈక్విటీల్లో భాగంగా ఎనిమిది వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు ఆయన వివరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థలోని ప్రీమియంలలోని ఆదాయం 20శాతం మేరకు వృద్ధి చెందిందని ఎల్ఐసీ అధ్యక్షుడు టీ.ఎస్. విజయన్ తెలిపారు. |