బేసిక్ ప్రైమ్ లెండింగ్ రేట్(బీపీఎల్ఆర్)ను భారతీయ స్టేట్ బ్యాంక్ తగ్గించింది.
బీపీఎల్ఆర్‌ను తగ్గిస్తూ ఎస్‌బీఐ బుధవారం ఉత్వరులు జారీ చేసింది. ఇందులో భాగంగా బీపీఎల్ఆర్‌లో అరశాతం మేరకు తగ్గించినట్లు బ్యాంక్ తన నిర్ణయాన్ని వెల్లడించింది.
తమ బ్యాంక్ నిర్ణియంచిన బీపీఎల్ఆర్ 11.75 శాతంగా ఉంటుందని ఆ బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. తాజా సవరణ జూన్ నెల 29వ తేదీనుంచి అమలులోకి వస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. |