ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ అయిన టీవీఎస్ మోటార్ కంపెనీ.. 1255సీసీ ఇంజిన్‌తో కూడిన ఆధునిక వెర్షన్ బైక్ ఫ్లేమ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈ ఆధునిక బైక్ ఎక్స్ షోరూం ధర రూ. 47,550 వద్ద లభిస్తుందని టీవీఎస్ సంస్థ తెలిపింది.టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెటింగ్ విభాగ అధ్యక్షుడు హెచ్ఎస్ గొయిందీ మాట్లాడుతూ, ఆధునిక టెక్నాలజీ సీసీ-వీటీఐను ఉపయోగించి ఈ బైకును రూపొందించినట్లు తెలిపారు. ఏవీఎల్ ఆస్ట్రియాతో కలిసి 122సీసీ బైకును వృద్ధి చేశామని.. ఈ బైకు గంటకు 95 కి.మీల వేగంతో వెళ్లగలదని వివరించారు. అలాగే ప్రముఖ మోటారు వాహనాల సంస్థ అయిన బజాజ్ ఆటో లిమిటెడ్ ఉపయోగించిన ట్విన్-స్పార్క్ టెక్నాలజీని మిళితం చేస్తూ ఫ్లేమ్‌ను తయారు చేశామన్నారు. కాగా, ఈ రెండు కంపెనీలు గత రెండేళ్లుగా వాహన విక్రయాల్లోనే కాకుండా.. వాహన తయారీలోను పోటీపడుతున్నాయి. |