సిటీ బ్యాంక్ నిరుడు ఆర్థిక సంవత్సరంలో 20శాతం లాభాలను ఆర్జించింది. నిరుడు ఆర్థిక సంవత్సరంలో సిటీ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2173 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇదే గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1804 కోట్లుగా ఉండింది. దీంతో పోలిస్తే ఇరవై శాతం లాభాలు పెరిగినాయి. నిరుడు ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నికర ఆదాయం రూ. 10423 కోట్లుగా ఉండింది. అదే 2007-08వ ఆర్థిక సంవత్సరంలో రూ. 8410 కోట్లుగా ఉండింది. దీంతో నికర ఆదాయం 24శాతానికి పెరిగిందని బ్యాంక్ ప్రకటించింది. |