యూనిటెక్ నికర లాభంలో 28శాతం తగ్గింది.
దేశీయ అతి పెద్ద రెండవ రియల్ ఎస్టేట్ సంస్థ యూనిటెక్ లిమిటెడ్ నిరుడు ఆర్థిక సంవత్సరంలో రూ. 11 వందల 98 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇదే గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలు రూ. 16 వందల 62 కోట్లుగా ఉండింది. దీంతో పోలిస్తే ఇందులో 28శాతం లాభాలు తగ్గాయి.
ప్రస్తుతం ఆర్థికమాంద్యం, అత్యధికమైన వడ్డీల కారణంగా మార్కెట్లో వచ్చిన మార్పుల వలన తమ సంస్థకు లాభాలు తగ్గాయని కంపెనీ గురువారంనాడు ప్రకటించింది. కాని ప్రజలు పొదుపును పాటిస్తుండటంతో ఆ దిశగా తమ సంస్థ గృహాలను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించింది ఆ సంస్థ తెలిపింది.
గడచిన రెండు నెలల్లో ఆ సంస్థ దాదాపు నాలుగు వేల ఇండ్లను అమ్మింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర ఆదాయం రూ. 33.16 వందల కోట్లుగా ఉంది. ఇది 2007-08వ ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర ఆదాయం రూ. 42.80వందల కోట్లుగా ఉండింది. దీంతో పోలిస్తే 22.5శాతం తక్కువని కంపెనీ ప్రకటించింది.
ఇదిలావుండగా గత రెండునెలల్లో తన షేర్లు, సంపదను అమ్మి 55 కోట్ల డాలర్లను జమ చేసుకుందని కంపెనీ తెలిపింది. |