ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > బిటితో ఒప్పందం చేసుకున్న టాటా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బిటితో ఒప్పందం చేసుకున్న టాటా
బ్రిటీష్ టెలికామ్(బీటీ)తో టాటా కమ్యునికేషన్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు కంపెనీలు వాయిస్ మరియు ఐపీ సర్వీసెస్ రంగంలో తమ సేవలను పంచుకోనున్నాయి.

బ్రిటీష్ టెలికామ్(బీటీ)తో టాటా కమ్యునికేషన్స్‌ సంస్థ చేసుకున్న ఈ ఒప్పందం ఐదు సంవత్సరాలపాటు కొనసాగుతుందని టాటా సంస్థ బీఎస్ఈకి తెలిపింది. ఈ ఐదు సంవత్సరాలలో వివిధ దేశాలలో ఇంటర్నేషనల్ డైరెక్ట్ డయల్(ఐడీడీ) అలాగే వాయిస్ సేవలను కొనసాగిస్తుందని ఇందులో బిటికి ఎలాంటి సంబంధం ఉండదని సంస్థ తెలిపింది.

దీంతో బిటి సహకారంతో టాటా సంస్థ బ్రిటన్‌లో ఐడీడీ సేవలను కొనసాగించేలా చర్యలను తీసుకుంటుంది. ఆ తర్వాత యూరోప్ తదితర దేశాలలో టాటా కమ్యునికేషన్స్‌కు ఈ సేవలు కొనసాగించేందుకు బిటి సంస్థ అనుమతినిచ్చింది.

తాము చేసుకున్న ఈ ఒప్పందంతో ఇరు కంపెనీలకు మంచి లాభాలను ఆర్జించిపెట్టనుందని అలాగే సేవలుకూడా మరింత విస్తరించనుందని టాటా కమ్యునికేషన్స్‌కు చెందిన వాయిస్ సొల్యుషన్స్ అధ్యక్షుడు మైకేల్ గుయాట్ తెలిపారు.

అలాగే టాటాలాంటి సంస్థతో తమ సంస్థ ఒప్పందం చేసుకోవడం తమ అదృషంగా భావిస్తున్నామని బిటి హోల్‌సేల్ మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రాయన్ ఫిట్జ్ ప్యాట్రిక్ ఆనందం వ్యక్తం చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేసిన‌ నందన్
28శాతం తగ్గిన యూనిటెక్ నికర లాభం
ఐఓసీనుంచి రూ. 105 కోట్ల కాంట్రాక్ట్ పొందిన భెల్
ఎయిర్ ఇండియాను ఆదుకుంటాం : ప్రధాని
లాభాలు పెంచుకున్న సిటీబ్యాంక్
మూడు నెలల్లో విశాఖ ఐ. టెక్స్‌టైల్ పార్క్