భారతీయ స్టేట్ బ్యాంక్ తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ప్రామాణిక వడ్డీ రేటు(పీఎల్ఆర్)ను తగ్గించింది.
దేశీయ అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ తర్వాత ఐడీబీఐ పీఎల్ఆర్‌ను నాలుగు శాతం తగ్గిస్తున్నట్లు ఆ బ్యాంక్ గురువారంనాడు ప్రకటించింది. ఎస్‌బీఐ పీఎల్ఆర్‌ను అరశాతం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
దీంతో ఐడీబీఐ బ్యాంక్ పీఎల్ఆర్ 13శాతంనుంచి 12.75శాతానికి తగ్గింది. తగ్గించిన ఈ మార్పులు జులైనెలనుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. |