టాటా భాగస్వామ్యమున్న బ్రిటన్‌లోని కోరస్ సంస్థలో దాదాపు రెండు వేల ఉద్యోగాలు ఊడనున్నాయి. బ్రిటన్‌లోని కోరస్ సంస్థ రెండు వేలమందికి ఉద్వాసన పలుకుతున్నట్లు బీబీసీకి చెందిన వెబ్‌సైట్ ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎలాంటి హెచ్చరికలు జారీచేయలేదు. కాని బ్రిటన్‌కు చెందిన లేబర్ పార్టీ సభ్యుడు ఇలియాట్ మార్లే కోరస్ సంస్థలోని ఉద్యోగులను ఆ సంస్థ ఇంటికి పంపనున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా కోరస్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగానున్న తన సంస్థలోని ఉద్యోగులలో దాదాపు మూడువేల ఐదు వందల మందిని 2009 జనవరినెలలో ఉద్వాసన పలికింది. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఖర్చులను తగ్గించుకోవడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కంపెనీ ఇదివరకు ప్రకటించినట్లు బీబీసీ తెలిపింది. |