ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ఎక్సైజ్, సేవా పన్ను పెంచే అవకాశం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎక్సైజ్, సేవా పన్ను పెంచే అవకాశం
భారత ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల రేట్లను పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ అకౌంటింగ్, కన్సల్టింగ్ సంస్థ డెలోయిట్ పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదిత వస్తువుల, సేవల పన్నుతో సమానస్థాయికి తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల రేట్లు ప్రభుత్వం పెంచనుంది.

అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో మూడు ఉద్దీపన పథకాలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని ఆరు శాతానికి, సేవల పన్నును రెండు శాతానికి తగ్గించింది. తాజా బడ్జెట్‌లో వీటిని తిరిగి కొద్ది మేర పెంచే అవకాశం ఉందని డెలోయిట్ అభిప్రాయపడింది. అంతేకాకుండా డిసెంబరు ఉద్దీపన ప్యాకేజీలో ప్రకటించిన పరోక్ష పన్నుల తగ్గింపును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకునే వీలుందని పేర్కొంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నందన్ నీలేకని స్థానంలో మోహన్‌దాస్ పాయ్!
ఎనిమిదేళ్ల తర్వాత టాటా మోటార్స్‌కు వార్షిక నష్టాలు
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
ఎఫ్‌ఆర్‌బీఎమ్‌తో కష్టమే : ఆర్థికమంత్రి
త్వరలో ప్రాంతీయ విమానాశ్రయాలకు బిడ్డింగ్‌
చెరకు మద్దతు ధరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్