ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ఇప్పుడే ఇంధన ధరలు పెంచబోము: డియోరా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇప్పుడే ఇంధన ధరలు పెంచబోము: డియోరా
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలను ప్రభుత్వం ఇంకొంత కాలం పరిశీలిస్తుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ డియోరా తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. పెట్రోలియం ధరల పెంపు ప్రతిపాదనను పరిగణలోకి తీసుకునే ముందు, ప్రభుత్వం ఇంకొంత కాలం అంతర్జాతీయ ముడిచమురు ధరలను పరిశీలిస్తుందన్నారు.

దురదృష్టవశాత్తూ అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయి. తాజా పరిణామాలను ప్రభుత్వం గమనిస్తోందని మురళీ డియోరా పేర్కొన్నారు. ధరల్లో స్థిరత్వం కోసం ప్రభుత్వం ఇంకొంత కాలం వేచిచూస్తుందని తెలిపారు. ఇంధన ధరల పెంపు కారణంగా పేద ప్రజలు ఇబ్బంది పడతారని కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వానికి తెలుసన్నారు.

అందువలనే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గగానే దేశంలోనూ తమ ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించిందన్నారు. మళ్లీ ఇప్పుడు ధరలు పెరిగిన కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచే ముందు కేంద్ర మంత్రివర్గం ముడిచమురు ధరలను పరిశీలిస్తుందని తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రాష్ట్రానికే ఎన్‌బీపీపీపీఎల్‌ ప్రాజెక్టు
ఎక్సైజ్, సేవా పన్ను పెంచే అవకాశం
నందన్ నీలేకని స్థానంలో మోహన్‌దాస్ పాయ్!
ఎనిమిదేళ్ల తర్వాత టాటా మోటార్స్‌కు వార్షిక నష్టాలు
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
ఎఫ్‌ఆర్‌బీఎమ్‌తో కష్టమే : ఆర్థికమంత్రి