ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > రేసింగ్ కిట్ విడుదల చేసిన యమహా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రేసింగ్ కిట్ విడుదల చేసిన యమహా
దేశీయ ద్విచక్రవాహనాల తయారీ కంపెనీ అయిన యమహా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రేసింగ్ కిట్‌ను విడుదల చేసింది.

రేసింగ్‌పై ఎక్కువ మక్కువ చూపే యువకులను దృష్టిలో ఉంచుకుని యమహా కంపెనీ రేసింగ్ కిట్ ను రూపొందించి విడుదల చేసినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ త్రిపాఠీ తెలిపారు.

ఈ కిట్లను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించామని, వీటిని భారతదేశంలో ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రేసింగ్ కిట్లు తమ కంపెనీకి చెందిన వైజెడ్ఎఫ్ ఆర్ 15 మరియు ఎఫ్‌జెడ్‌లాంటి మోటార్ సైకిళ్ళకని ఆయన వివరించారు.

ఈ రేసింగ్ కిట్లను తాము జపాన్‌కు చెందిన డెటోనో కంపనీనుంచి దిగుమతి చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ కంపెనీ అంతర్జాతీయ స్థాయి మార్కెట్లో రేసింగ్ పరికరాలను రూపొందిస్తుందని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా ప్రస్తుతం దేశీయ యువకులు రేసింగ్ మోటార్ సైకిళ్ళపట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, ఇలాంటివారిని దృష్టిలో ఉంచుకుని ఈ రేసింగ్ కిట్లను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇప్పుడే ఇంధన ధరలు పెంచబోము: డియోరా
రాష్ట్రానికే ఎన్‌బీపీపీపీఎల్‌ ప్రాజెక్టు
ఎక్సైజ్, సేవా పన్ను పెంచే అవకాశం
నందన్ నీలేకని స్థానంలో మోహన్‌దాస్ పాయ్!
ఎనిమిదేళ్ల తర్వాత టాటా మోటార్స్‌కు వార్షిక నష్టాలు
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు