దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఆదివారం భారత్‌లో జాగువార్, లాండ్‌రోవర్ కారు బ్రాండ్లను ఆవిష్కరించింది. అమెరికా కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ నుంచి టాటా మోటార్స్ ఈ రెండు లగ్జరీ బ్రాండ్లను కొనుగోలు చేసింది.
టాటా మోటార్స్ చరిత్రలో ఇదొక మైలురాయి అని జాగువార్, లాండ్‌రోవర్ బ్రాండ్ల ఆవిష్కరణ సందర్భంగా టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా విలేకరులతో చెప్పారు. గతంలో జాగువార్, లాండ్‌రోవర్‌లకు దేశంలో ఎంతో ఆదరణ లభించింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ బ్రాండ్లు భారత వినియోగదారులకు దూరమయ్యాయి.
తాము తిరిగి దేశీయ మార్కెట్‌లో వీటిని అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు రతన్ టాటా తెలిపారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఈ కార్లు భారత వినియోగదారులకు ఓ సరికొత్త అనుభవాన్ని ఇస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. బ్రిటన్‌కు చెందిన ఈ రెండు బ్రాండ్లను టాటా మోటార్స్ గత ఏడాది 2.3 బిలియన్ డాలర్లకు ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసింది. |