కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఒకశాతానికిపైగా లోటుండవచ్చని స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్ అండ్ పీ) సంస్థ తెలిపింది.
కేంద్రం ద్వారా ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో గతంలో ఇచ్చిన రాయితీల ప్యాకేజీలవలన కేంద్ర ఖజానాలో లోటు ఏర్పడనుందని, దీంతో జీడీపీ రేటు 6.5శాతానికి చేరుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.
గతంలో ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం మరింత ప్రోత్సాహక రాయితీలు ఇవ్వనుందని తెలిపారని, దీంతో జీడీపీ 0.5శాతం తగ్గేసూచనలున్నట్లు ఎస్ అండ్ పీ సంస్థ డైరెక్టర్ టీ.కే. ఒగోవా తెలిపారు.
ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపు బడ్జెట్‌లో కేంద్ర ఖజానా జీడీపీ రేటు 5.5శాతంగా నమోదు చేసుకోవచ్చని సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. కాగా ఆర్థిక మంత్రి జులై నెల ఆరవ తేదీన సంపూర్ణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం విదితమే. |