ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > లాభాల్లో హోటల్ లీలావెంచర్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లాభాల్లో హోటల్ లీలావెంచర్
FILE
గత ఆర్థిక సంవత్సరంలో హోటల్ లీలావెంచర్ లిమిటెడ్ సంస్థ రూ. 144 కోట్ల 98 లక్షల లాభాలను ఆర్జించింది. అదే 2007-08 ఆర్థిక సంవత్సరానికి రూ. 149 కోట్ల 99 లక్షల లాభాలను పొందింది.

తమసంస్థకు గత ఆర్థిక సంవత్సరంలో నికర ఆదాయం రూ. 582 కోట్ల 16 లక్షలు లభించిందని, ఇదే ఇదివరకటి ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి నికర ఆదాయం రూ. 589 కోట్ల 10 లక్షలుగా ఉండిందని కంపెనీ ఉపాధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ నాయర్ తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం, ముంబైలో నిరుడు జరిగిన ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో హోటల్ వ్యాపారంలో ఒడిదుడుకులు వచ్చాయని, దీంతో వ్యాపారాలు తగ్గాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా ప్రస్తుతం పరిస్థితి ఆశాజనకంగా ఉందని, అక్టోబర్ నుంచి పర్యటన కాలం ప్రారంభమవుతోందని, దీంతో వ్యాపారపరంగా ఆశాజనకంగా ఉండగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా తమ సంస్థలు రానున్న రోజుల్లో వ్యాపార పరంగా వృద్ధిని సాధించేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తోందని, ఇందులో భాగంగా తాము గుర్‌గాంవ్‌లో ఓ హోటల్, పిఛోలా సరస్సువద్ద ఉదయ్‌‍పుర్ రిసార్ట్‌ను ప్రారంభించామని ఆయన వివరించారు. ఢిల్లీ మరియు చెన్నై ప్రాంతాలలో త్వరలో హోటళ్ళు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
జీఎస్‌టీ అమలుకు అడ్డంకులు
ఉద్యోగాలు కోల్పోయిన 4 లక్షల మంది
విద్యుత్ ఉత్పత్తిలో మరింత వృద్ధి: భూపేంద్ర సింగ్
తగ్గనున్న సిమెంట్ ధరలు
కేంద్ర ఖజానాలో లోటు ఏర్పడనుంది...!
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు