రాష్ట్ర రైతులకు బీమా నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి తెలిపారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రైతులుకు రూ. 8వందల కోట్ల పంట బీమా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. ఈ సొమ్మును నేరుగా రైతుల ఖాతాలలోకి జమ చేస్తున్నట్లు ఆయన వివరించారు. రైతులు పంటలకు బీమా చేయించుకోవాలని దీంతో వారి పంటలకు ప్రకృతిరీత్యా వచ్చే నష్టాలకు ప్రభుత్వం ఆదుకుని బీమా సొమ్మును సంబంధిత రైతుల ఖాతాలలోనే జమ చేస్తుందని ఆయన తెలిపారు. ఇకపై ప్రతి రైతుకూడా తమ పంటలకు బీమా చేయించుకోవాలని, రాష్ట్రప్రభుత్వం రైతులకు సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన అన్నారు. |