జూన్ నెలలో మారుతి అమ్మకాలు 23శాతం పెరిగాయి. దేశీయ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగానున్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థ మారుతి కార్ల అమ్మకాలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ నెలలో 22.63శాతం పెరిగి 75,109 వాహనాలు అమ్ముడు పోయాయని ఆసంస్థ తెలిపింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో 61,247 వాహనాలు అమ్నుడుపోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దేశీయ మార్కెట్లో అమ్మకాలు 9.51శాతానికి చేరుకున్నాయని దీంతో 61,773 వాహనాలను జూన్ నెలలో అమ్మినామని, అదే గత సంవత్సరం ఇదే నెలకు 56,411 వాహనాలను అమ్మనట్లు సంస్థ తెలిపింది. అదే విదేశాలకు తమ కార్లను ఎగుమతి చేయడంలోకూడా వృద్ధిని సాధించామని జూన్ నెలలో 13,336 వాహనాలను ఎగుమతి చేయగా అదే గత సంవత్సరం ఇదే కాలానికి 4,836 వాహనాలను ఎగుమతి చేసినట్లు మారుతి సుజుకి ఇండియా(ఎమ్ఎస్ఐ) ఓ ప్రకటనలో తెలిపింది. తమ కంపెనీ అమ్మకాలు వరుసగా ఆరు నెలల్లో సరాసరి 70వేల వాహనాలను అమ్మినట్లు సంస్థ తెలిపింది. అందునా కార్ల ఎగుమతుల్లో కూడా రికార్డును సాధించామని సంస్థ ప్రకటించింది.కంపెనీకి చెందిన అతి పురాతనమైన మోడల్ ఎమ్800 2,438వాహనాలను అమ్మి 54.52శాతాన్ని నమోదు చేసుకుంది. అదే గత సంవత్సతరంలో 5,361 వాహనాలను అమ్ముడుపోయినట్లు కంపెనీ తెలిపింది. ఇదిలావుండగా ఏ2 సెగ్మెంట్‌కు చెందిన వాహనాలు(ఆల్టో, వాగన్ ఆర్, జెన్ ఎస్టిల్లో, స్విఫ్ట్, ఏ-స్టార్ మరియు రిట్జ్) వాహనాలు 22.21శాతం నమోదు చేసుకుని 46,156వాహనాలు అమ్ముడుపోయాయని అదే గత సంవత్సరం ఇదే నెలలో 37,767 వాహనాలు అమ్ముడుపోయాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఏ3 సెగ్మెంట్‌లో(ఎస్ఎక్స్4 మరియు డిజైర్) వాహనాలు 5.03శాతం పెరిగి 6,099 వాహనాలు అమ్ముడుపోయాయి. ఇది గత సంవత్సరం ఇదే నెలకు 5,807 వాహనాలు అమ్మిట్లు కంపెనీ తెలిపింది. ఎమ్ఎస్ఐకి చెందిన ప్రయాణికులు వాహనాల అమ్మకాలలోకూడా వృద్ధిని సాధించి 10.17శాతానికి చేరుకుంది. దీంతో 61,583 వాహనాలు అమ్మి రికార్డు సృష్టించాయి. ఇదే గత సంవత్సరం జూన్ నెలలో 55,899 వాహనాలు అమ్మినట్లు కంపెనీ తెలిపింది. |