ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > మళ్ళీ పెరిగిన పెట్రోలు ధరలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మళ్ళీ పెరిగిన పెట్రోలు ధరలు
FILE
దేశంలో మరోమారు పెట్రోలు ధరలు భగ్గుమన్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి మురళీదేవరా ప్రకటించారు.

పెట్రోలు లీటర్‌కి రూ.4, డీజిల్‌పై రూ.2 పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. పెంచిన ధరలు బుధవారం అర్థరాత్రినుంచే అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు.

అంతకు ముందు దేవరా, ప్రధాన మంత్రితో భేటీ అయ్యారు. అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో పెట్రో ధరలు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే వంటగ్యాస్‌, కిరోసిన్‌ ధరలు మాత్రం పెంచేది లేదని ఆయన స్పష్టం చేశారు.

అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరల కారణంగా లోటును పూర్తి చేసుకునేందుకే తాము ధరలను పెంచాల్సివచ్చిందని ఆయన వివరించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రైల్వే బడ్జెట్...ప్రజల బడ్జెట్‌గా ఉంటుంది: మమతా బెనర్జీ
అమ్మకాలు పెంచుకున్న మారుతి
భారత ఉత్పత్తులను నిషేధిస్తాం: చైనా
రాష్ట్ర రైతులకు బీమా నిధుల విడుదల: రఘువీరా
ఆర్థిక వ్యవస్థ గాడిలో పడినట్లే...!
సత్యం డైరెక్టర్లను వెనక్కి రప్పించనున్న ప్రభుత్వం