దేశంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన నిర్మాణ కంపెనీ అయిన హీరో హోండా అమ్మకాలు జూన్ నెలలో 23.70శాతం పెరిగి 3,65,734 వాహనాలు అమ్మినట్లు కంపెనీ ప్రకటించింది. ఇదే గత సంవత్సరం జూన్ నెలలో కంపెనీ 2,95,675 వాహనాలను అమ్మినట్లు కంపెనీ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు మాసాలలో కంపెనీ వాహనాల అమ్మకాలు 25.13శాతం వృద్ధి చెంది 11,18,987వాహనాల అమ్మకం జరిగింది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 8,94,244 వాహనాల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ అధ్యక్షుడు అనిల్ దుఆ అన్నారు.
ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తమ కంపెనీకి లాభాలను తెచ్చిపెట్టిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. |