మోటారు వాహన నిర్మాణ రంగాలలో అగ్రగామిగానున్న దేశీయ సంస్థ టాటా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాంతం జూన్ నెలలో వాహనాల అమ్మకాలు నాలుగు శాతం తగ్గుదల నమోదు చేసుకుంది. జూన్ నెలలో ఆసంస్థకు చెందిన వాహనాలు కేవలం 45399 మాత్రమే అమ్మడుపోయాయి. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 47245 వాహనాలు అమ్మడు పోయాయి. దీంతో నాలుగుశాతం తగ్గుదల కనపడిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తమ సంస్థ 123113 వాహనాలను అమ్ముడుపోయిందని అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 131733 వాహనాలు అమ్మడుపోయాయి. దీంతో పోలిస్తే ఏడుశాతం తగ్గుదలకనపడిందని కంపెనీ ప్రకటించింది. మధ్యతరహా వాహనాలు మరియు భారీ వాహనాలు నిరుడు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి 26శాతం తగ్గుదల కనపడింది. దీంతో 26626 వాహనాలు అమ్ముడుపోయాయి. అదే సాధారణ వాహనానల అమ్మకాలు 27శాతం తగ్గుదలను నమోదు చేసుకుని 45430 వాహనానలు అమ్ముడుపోయాయని కంపెనీ తెలిపింది. ఇదిలావుండగా జూన్ నెలలో టాటా వాహనాలు సాధారణ మార్కెట్లో 19513 వాహనాలు అమ్ముడుపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 17567వాహనాలు అమ్ముడుపోయాయి. దీంతో ఈ సంవత్సరంకన్నా నిరుడు వాహనాల అమ్మాకాలు ఏడుశాతం ఎక్కువ అని కంపెనీ అధికారులు తెలిపారు. కాగా నిరుడు జూన్ నెలలో ఫియెట్ కారులు 550 అమ్ముడుపోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ నెలలో 2474 కార్లు అమ్ముడుపోయినట్లు కంపెనీ ప్రకటించింది. |