పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారంనుంచి ప్రారంభమయ్యాయి. నిరుడు ఆర్థిక సంవత్సరం(2008-09)కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ తొలిరోజున లోక్‌సభకు సమర్పించారు. ఇదిలావుండగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ నెల ఆరవ తేదీన ప్రవేశపెట్టనున్నారు. కాగా మూడవ తేదీన రైల్వేశాఖామంత్రిణి మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే పెరిగిన పెట్రోలు ధరలు, లిబర్హాన్ కమిషన్ సమర్పించిన నివేదికపై అధికార, విపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగారు. ** ఆర్థిక సర్వే 2009 ప్రధానాంశాలు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభలో గురువారంనాడు ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. అందులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి... ** నిరుడు ఆర్థిక సంవత్సరం(2008-09)లో ఆర్థిక వృద్ధిలో తగ్గుదల కనపడి 6.7శాతానికి చేరుకుంది. అదే గత ఆర్థిక సంవత్సరంలో 9శాతంగా ఉండింది. ** నిరుడు ఆర్థిక సంవత్సరం(2008-09)లో కేంద్ర ఖజానా లోటు 6శాతానికి పెరిగింది. అదే గత ఆర్థిక సంవత్సరంలో లోటు 2.7శాతంగా ఉండింది. ** పన్నుల్లో కోతతోపాటు ఇతర ఆర్థిక ప్యాకేజీలలో రాయితీలు.** నవరత్న హోదాలేని ప్రభుత్వ రంగ దిగ్గజ కంపెనీల్లోని పీఎస్‌యూలలో 5 నుంచి 10 శాతం ఈక్విటీలను అమ్మే ప్రక్రియ త్వరితంగా పూర్తి చేయడం. **ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాల్లో కూరుకుపోయిన, గట్టున పడేయలేని కొన్ని సంస్థలను, పీఎస్‌యూలను వేలం వేసేందుకు నిర్ణయం. ** కొత్తగా ప్రవేశపెట్టిన పన్ను కోడ్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనుంచి అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడం. ** 3జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేయడం. వేలం వేసి వచ్చిన సొమ్మును పన్ను చట్టం పరిధిలోకి తీసుకురావడం. ** సంయుక్త కంపెనీల ఏప్రాటు , విదేశీ కంపెనీలతో జట్టు, నిర్ణీత పరిమాణంవరకు ఇతర కంపెనీల విలీనాలు, కొనుగోళ్ళ విషయాలలో సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. |